రారండోయ్ పాటలు విందాం

Raarandoy audio to be released soon
Thursday, May 4, 2017 - 00:45

నాగచైతన్య కొత్త సినిమా "రారండోయ్ వేడుక చూద్దాం" త్వరలోనే పాటలతో సందడి చేయబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బడా హీరోలంతా ఫాలో అవుతున్న ట్రెండ్ నే చైతూ కూడా ఫాలో అవుతున్నాడు. తన కొత్త సినిమా రారండోయ్ వేడుక చూద్దాం పాటల్ని ఆన్ లైన్లో విడుదల చేయబోతున్నాడు. ఇందులో భాగంగా మొదటి సింగిల్ శనివారం రిలీజ్ అవుతుందని ప్రకటించాడు చైతూ.

నిన్నే పెళ్లాడతా, మన్మధుడు సినిమాలకు దగ్గరగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను తెరకెక్కించారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించాడు కూడా. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఈనెల 26న విడుదల అవుతుంది. కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.