విజ‌య్‌తో ముద్దు కోసం త‌హ‌త‌హ‌!

Raashi Khanna to do smooch scene with Vijay Deverakonda
Saturday, May 4, 2019 - 23:15

విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంత టాలెంటెడ్ స్టారో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. నిర్మాత అల్లు అర‌వింద్ మాట‌ల్లో చెప్పాలంటే ఈ జ‌న‌రేష‌న్లో అత్యంత వెర్స‌టైల్ స్టార్‌. అందుకే త‌క్కువ టైమ్‌లోనే ఇంత సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గ‌లిగాడు. ఐతే ఈ హీరోకి టాలీవుడ్ ఇమ్రాన్ హ‌స్మీ అనే పేరు కూడా ఉంది. వెండితెర‌పై ముద్దుల విష‌యంలో ఒక‌పుడు సంచ‌ల‌నం సృష్టించిన హ‌స్మీకి పోటీ ఇస్తున్నాడు. ఐతే అత‌నితో కిస్ సీన్ల‌లో న‌టించేందుకు హీరోయిన్లు కూడా త‌హ‌త‌హ‌లాడుతుండ‌డం ఒక విశేష‌మే.

ఇటీవ‌ల ఓ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో హీరోయిన్ రాశిఖ‌న్నా చెప్పిన మాట అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ర‌ష్మిక త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ ముద్దు పెట్ట‌బోయే హీరోయిన్‌ని నేనే అంటూ ఆనందంగా చెప్పింది. దీన్ని బ‌ట్టి చెప్పొచ్చు ఆమె ఎంత ఆనందంగా, ఆస‌క్తిగా ఈ విష‌యాన్ని చెప్పింది. అది మ‌న అర్జున్‌రెడ్డికున్న క్రేజ్‌.

మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు వంటి మంచి మెచ్యుర్డ్ ల‌వ్‌స్టోరీ తీసిన ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఒక చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమాలో న‌లుగురు హీరోయిన్లు. అందులో మెయిన్ హీరోయిన్‌గా రాశిఖ‌న్నా న‌టిస్తోంది. ఆమె చెపుతున్న దాన్ని బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమాలోనూ చుంభ‌న సీన్లు ఉంటాయి.