అన్నంత పని చేసింది

Raashi Khanna learns guitar
Tuesday, May 26, 2020 - 15:15

ఈ లాక్ డౌన్ టైమ్ లో గిటార్ నేర్చుకుంటున్నాననే విషయాన్ని బయటపెట్టింది హీరోయిన్ రాశిఖన్నా. ఆన్ లైన్ క్లాసుల ద్వారా గిటార్ నేర్చుకుంటున్నానని, త్వరలోనే అందరి కోసం ఓ పాట కూడా పాడతానని ఈమధ్యే ప్రకటించింది. హీరోయిన్లంతా ఇలానే చెబుతారంటూ అప్పట్లో అంతా లైట్ తీసుకున్నారు. కానీ రాశిఖన్నా మాత్రం సీరియస్ గా తీసుకుంది.

గిటార్ నేర్చుకోవడమే కాకుండా, ఏకంగా ఓ పాట పాడేసింది ఈ బ్యూటీ. గిటార్ వాయిస్తూ తను పాడిన పాటను సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. తనింకా బేసిక్ లెవెల్లోనే ఉన్నానని, మెల్లమెల్లగా గిటార్ నేర్చుకుంటున్నానని ప్రకటించింది రాశి.

"గిటార్ నేర్చుకోవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికీ నేనింకా బిగినింగ్ లెవెల్లోనే ఉన్నాను. మనం పాజిటివ్ గా ఉండడానికి ఈ గిటార్ అలవాటు చాలా మంచిది. ఎప్పుడు గిటార్ పట్టుకున్నా నా ముఖంపై ఆటోమేటిగ్గా చిరునవ్వు వచ్చేస్తుంది."

ఇలా తన గిటార్ క్లాసుల గురించి, పాట గురించి చెప్పుకొచ్చింది రాశిఖన్నా. అంతేకాకుండా.. తను పాడిన ఇంగ్లిష్ పాట లిరిక్స్ ను కూడా పోస్ట్ చేసింది. కావాలంటే తనతో పాటు హమ్ చేయొద్దని కోరింది.