ఇదే రాశి ఖన్నా కొత్త లుక్

Raashi Khanna shares her new look with mask
Tuesday, April 7, 2020 - 16:15

ఇదే నా కొత్త లుక్ అంటూ రాశి ఖన్నా ఒక ఫోటోని షేర్ చేసింది. ఇది ఆమె కొత్త సినిమాలో లుక్ అనుకునేరూ. కాదు. ఇది కోవిడ్ లుక్.

 ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మాస్క్ లు ధరించాలి. కానీ మాస్కుల కొరత ఉంది. డాక్టర్లకి, నర్సులకి, పోలీసులకి ముఖ్యం. అందుకే... ఎవరికీ వారు ఇంట్లోనే ఈ మాస్కులు రెడీ చేసుకోవచ్చు. చున్నీతో ఇలా చేస్కోండి అనే సందేశంతో ఈ భామ తన కొత్త లుక్ ఇది అంటూ పోస్ట్ చేసింది. 

బాగుంది కదా!. అమ్మాయిలు ఇటీవల బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ నుంచి తమ ఫేస్ ని కాపాడుకుందుకు చున్నీలను ఇలా చుట్టుకుంటున్నారు. ఇప్పుడే అదే అక్కరకి వస్తోంది.