నాకు రెండు ఉన్నాయి: రాశి ఖన్నా

Raashi Khanna talks about breakups
Wednesday, February 12, 2020 - 09:15

"ప్రతి అమ్మాయి ప్రేమలో పడుతుంది. అది సహజం. ఐతే అన్ని ప్రేమలు సక్సెస్ కావు. ఈ రోజుల్లో బ్రేకప్ లు కామన్. నాకు కూడా రెండు (బ్రేకప్ లు) ఉన్నాయి," అని ఓపెన్ గా తన ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ల గురించి చెప్పింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ విషయాన్ని బయట పెట్టింది. 

రాశి ఖన్నా గతేడాది 'ప్రతి రోజు పండగే' సినిమాలో టిక్ టాక్ వీడియో భామగా నటించి మంచి పేరు తెచ్చుకొంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో యామిని అనే పాత్ర పోషించింది. ఈ సినిమాలో విజయ్ తో ముద్దు సీన్లు కూడా చేసింది. విజయ్ ని తెగ పొగుడుతోంది.