ఆ సెక్స్ సీన్ వెనుక ఉన్నదేంటంటే!

Raashi Khanna talks about love making scene with Vijay Deverakonda
Tuesday, February 4, 2020 - 18:15

"వరల్డ్ ఫేమస్ లవర్"... ఇది విజయ్ దేవరకొండ కొత్త చిత్రం. ప్రేమికుల రోజు రిలీజ్ కానుంది. ఇందులో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. సినిమా టీజర్ లో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రాశి ఖన్నా మధ్య కొన్ని హాట్ సీన్లు ఉన్నట్లు హింట్ కనపడింది. ఒక ముద్దు సీన్, ఒక సెక్స్ సీను దర్శనం ఇచ్చింది. ఈ సీన్ విషయంలో ఆమెని ఫాన్స్ బాగా కామెంట్ చేశారట. తాను అలాంటి వాటికి దూరముండాలని సజెషన్ ఇచ్చారట. 

దానిపై స్పందించింది రాశి ఖన్నా. "నేను పోషించిన యామిని పాత్ర చాలా క్లిష్టమైన క్యారక్టర్. ఆ సెక్స్ సీన్ వెనుక ఒక కీలకమైన ఎమోషన్ ఉంది. ఆ సీన్ ఎదో... యూత్ ని అట్ట్రాక్ట్ చేద్దామనే కోణంలో పెట్టలేదు. మూవీ చూస్తే దాని మీనింగ్ అర్థం అవుతుంది. నేను చేసింది కరెక్ట్ అనిపిస్తుంది," అని చెప్పింది. ఇక ముద్దు సీన్ల గురించి ఎక్కువ థింక్ వద్దు అని అంటోంది. 

రాశి ఖన్నా ఇటీవల ప్రతి రోజు పండగే సినిమాలో మంచి నటన ప్రదర్శించింది. అయితే, వరల్డ్ ఫేమస్ లవర్ లోని యామిని పాత్ర బాగా నేమ్ తెస్తుంది అని చెప్తోంది.

|

Error

The website encountered an unexpected error. Please try again later.