మళ్ళీ మ్యూజిక్ డైరక్టర్ మిస్

Radhe Shyam team mentions no music director
Friday, July 10, 2020 - 12:15

తెలుగులో ఏ హీరోకు జరగని వ్యవహారం ఒక్క ప్రభాస్ విషయంలోనే మరోసారి రిపీట్ అయింది. అవును.. మ్యూజిక్ డైరక్టర్ ఎవరో తెలియకుండానే ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ హీరోకు ఇలా జరగడం ఇది రెండో సారి. 

ఈరోజు ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. "రాధేశ్యామ్" అనే టైటిల్ కూడా పెట్టారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు కూడా షేర్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ మ్యూజిక్ డైరక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.

గతంలో కూడా "సాహో" సినిమాకు ఇలానే జరిగింది. "సాహో" సినిమాకు శంకర్-ఎహశాన్-లాయ్ ను మ్యూజిక్ డైరక్టర్స్ గా తీసుకున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైమ్ కు వాళ్లు తప్పుకున్నారు. దీంతో మ్యూజిక్ డైరక్టర్ పేరు లేకుండానే అప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇప్పుడు విషయంలో కూడా అదే రిపీటైంది. ఈ సినిమా హిందీ హక్కులను టి. సిరీస్ తీసుకొంది. టి.సిరీస్ పాలసీ ప్రకారం ఒక సంగీత దర్శకుడికి రెండు పాటలుకి మించి ఇవ్వరు. అంటే ఒకే సినిమా ఆల్బంలో ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పాటలు ఇస్తారు. "సాహో" సినిమాకి తనిష్క్ భాగిచీ, గురు రంధావా, బాద్షా పాటలు ఇవ్వగా, జీబ్రాన్ బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. 

"రాధే శ్యామ్"కి కూడా ముగ్గురు సంగీత దర్సకులు పనిచేస్తున్నారు. టి.సిరీస్ సినిమా నిర్మాణంలో పలు పంచుకుంటే ...అదే పద్దతి.