రాధికకి కరోనా లేదంట

Radhika Apte denies testing positive for coronavirus
Saturday, March 28, 2020 - 17:30

నిన్న సాయంత్రం నుంచి తెగ వైరల్ అవుతున్న వార్త ఇది. బాలయ్య సరసన నటించి, ఆ తర్వాత బాలయ్యనే తిట్టిన హీరోయిన్ రాథికా ఆప్టేకు కరోనా సోకిందంటూ నిన్నట్నుంచి ఒకటే వార్తలు. దీనికి కారణం కూడా రాథికానే. హాస్పిటల్ లో ఓ టేబుల్ పై కూర్చొని, ముఖానికి మాస్కు తగిలించుకున్న ఫొటోను రాథికా షేర్ చేసింది.

దీంతో గాసిప్ రాయుళ్లు రెచ్చిపోయారు. రాథికకు పాజిటివ్ వచ్చిందంటూ అల్లేశారు. ఊహించని విధంగా తనపై పుకార్లు రావడంతో రాథికా వెంటనే క్లారిటీ ఇచ్చింది. తనకు కరోనా సోకలేదని స్పష్టంచేసిన రాథిక, వేరే పనిమీద హాస్పిటల్ కు వచ్చానని, ముందు జాగ్రత్తగా మాస్క్ పెట్టుకున్నానని స్పష్టం చేసింది. కనీసం తను కరోనా పరీక్ష కూడా చేయించుకోలేదంటోంది ఈ బ్యూటీ.

తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చెప్పిన రాథిక, తన ఫ్యాన్స్ కు కరోనా జాగ్రత్తలు చెప్పింది. అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరింది. ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడే కరోనాను అరికట్టగలమని సందేశం ఇచ్చింది. ఇన్ని విషయాలు చెప్పిన రాథిక, అసలు తను హాస్పిటల్ కు ఎందుకు వచ్చిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.