బీచ్ లో చీర కట్టుకోమంటారా?

Radhika Apte slams trollers: sorry, no sari in beach!
Saturday, March 10, 2018 - 14:15

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రాలింగ్ కు గురయ్యే సెలబ్రిటీస్ లో రాధికా ఆప్టే కూడా ఒకరు. ఆమెపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విరుచుకుపడుతూనే ఉంటారు నెటిజన్లు. తాజాగా ఆమె పెట్టిన ఓ బికినీ స్టిల్ పై కూడా అలానే ట్రాలింగ్ షురూ చేశారు. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న రాధికా ఆప్టే, గోవా బీచ్ లో బికినీలో సేదతీరుతున్న స్టిల్ ను ఇనస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పక్కనే ఆమె ఫ్రెండ్, సినిమా ఎడిటర్ మార్క్ రిచర్డ్ సన్ కూడా ఉన్నాడు. ఆ స్టిల్ పై సోషల్ మీడియాతో దుమారం రేగింది.

ఇదే విషయంపై రాధికా ఆప్టేను ప్రశ్నిస్తే ఓ రేంజ్ లో విరుచుకుపడింది ఈ బ్యూటీ.

"ఎవరో చెప్పే వరకు నేను ట్రాలింగ్ కు గురయ్యానని నాకు తెలీదు. అయినా బీచ్ లో చీర కట్టుకొని తిరగమంటారా" అంటూ ట్రాలర్స్ కు అదిరిపోయే సమాధానమిచ్చింది ఈ బ్యూటీ. డ్రెస్సింగ్ విషయంలో సోనమ్ కపూర్, తాప్సి లాంటి తారలు ఎప్పటికప్పుడు ట్రాలింగ్ కు గురవుతుంటారు. వాళ్లిద్దరి తర్వాత ఎక్కువగా ట్రాలింగ్ కు గురయ్యేది రాధికే ఆప్టేనే.