రాధికని రిజెక్ట్ చేసిన డైరక్టర్

Radhika Apte talks about the direcotr
Friday, July 31, 2020 - 17:15

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనే పదానికి సరిగ్గా సరిపోతుంది రాధికా ఆప్టే. వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా.. తన యాక్టింగ్ తో ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడీ హీరోయిన్ తాజాగా మరో ఒరిజినల్ మూవీతో మనముందుకొచ్చింది.

ఆమె నటించిన "రాత్ అకేలీ హై" అనే మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రమోషన్ కోసం రంగంలోకి దిగిన రాధికా.. ఈ మూవీ డైరక్టర్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టింది.

"రాత్ అకేలీ హై" మూవీతో హనీ ట్రెహాన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అతడు అంతకుముందు కాస్టింగ్ డైరక్టర్ గా వర్క్ చేశాడు. అంటే కథకు తగ్గట్టు నటీనటుల్ని ఎంపిక చేసే పని అన్నమాట. ఈ సందర్భంగా ఎన్నోసార్లు ఆడిషన్స్ ఇచ్చిందట రాధిక. కానీ చాలాసార్లు హనీ, ఆమెను రిజెక్ట్ చేశాడట.

అలాంటి హనీ, దర్శకుడిగా మారిన తర్వాత ఏరికోరి తనకోసం వచ్చాడని, అందుకే స్క్రిప్ట్ కూడా చదవకుండా ఓకే చెప్పానని అంటోంది రాధిక ఆప్టే. తనతో పని చేయించుకోవడం ఎలాగో హనీకి బాగా తెలుసంటోంది.