వాళ్లు చాలా ప‌వ‌ర్‌ఫుల్

Radhika says South Indian male stars are so powerful
Tuesday, March 20, 2018 - 17:30

ఒక ద‌క్షిణాది హీరో సూప‌ర్‌స్టార్ చెంప చెళ్లుమ‌నిపించాను అని ఆ మ‌ధ్య చెప్పింది రాధిక ఆప్టే. త‌న పాదాన్ని ఆ హీరో అత‌ని కాలితో గోకాడు. దాని ఉద్దేశమేంటో అర్థ‌మైంది. అంతే చెంప వాయించా అని చెప్పింది రాధిక‌.

ఇపుడు ఈ భామ మ‌రో మాట కూడా చెపుతోంది. సౌత్‌లో హీరోలు చాలా ప‌వ‌ర్‌ఫుల్‌...నాకు అక్క‌డ అన్ని చేదు అనుభ‌వాలే అంటోంది ఈ భామ‌.

"పారితోషికం బాగానే ఇస్తారు. అందులో డౌట్ లేదు. కానీ హీరోయిన్ల‌ను పూచికపుల్ల‌లా తీసిపారేస్తారు. మొత్తం సౌత్  ఇండ‌స్ట్రీ అంతా ఇలాగే ఉంటుంద‌ని అన‌ను కానీ నాకు అలాంటి అనుభ‌వాలే ఎద‌ర‌య్యాయి. సెట్స్‌కు రెండు గంటల ముందుగానే రావాలి హీరోయిన్లు రావాలి.  హీరోలు వచ్చే వరకూ ఎదురుచూడాలి," రాధిక ఆప్టే త‌న అనుభ‌వాల‌ను వెల్ల‌డించింది.

‘రక్తచరిత్ర’, 'ధోని' ‘లయన్‌’, ‘లెజెండ్’, 'క‌బాలి', 'ఆల్ ఆన్ ఆల్ అళ‌గి రాజా' వంటి ద‌క్షిణాది చిత్రాల్లో నటించింది ఆమె.