రిసార్ట్ కు వస్తే విప్పేస్తా, చెప్పేస్తా

A radio anchor sees the other side of Senior actor
Friday, November 22, 2019 - 13:45

దాదాపు 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఓ సీనియర్ నటుడు చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఆయన నటించని సినిమా లేదు. అంతెందుకు, ఒకప్పుడు ఆయన లేకపోతే సినిమానే లేదు. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేద్దామని ఆయన ఇంటికి వెళ్లింది ఓ రేడియో యాంకర్. ఆమె ఒక్కతే వెళ్ళలేదు. ఒక సాంస్కృతిక సంస్థ ప్రతినిధులతో కలిసి ..... ఒక ఈవెంట్ కి ఇన్విటేషన్ ఇచ్చేందుకు వెళ్ళింది. 

ఆ యాంకర్ అందగత్తె. ఆ అందానికి ఆ సీనియర్ నటుడు కూడా పడిపోయాడు కాబోలు.. వెంటనే నాకు జీవిత చరిత్ర రాసుకోవాలి అని ఉందని... అది మీరు రాస్తే సూపర్ గా ఉంటుంది అనే ప్రతిపాదన పెట్టాడట. రెండు మూడు రోజులు ప్రశాంతంగా ఎక్కడైనా రిసార్ట్ కి వెల్దాము... అక్కడ తన జీవితంలోని అన్ని కోణాలు విప్పేస్తా... మొత్తం డిటైల్డ్  గా చెప్పేస్తా ....అంటూ పులిహోర కలిపాడట. తన జీవితంలో ఓ బయోపిక్ తీసేంత స్టఫ్ ఉందని, జీవిత చరిత్రను రాసే అవకాశం నీకే ఇస్తానంటూ యాంకర్ పిల్లను రిసార్ట్ కు ఆహ్వానించాడు సదరు సీనియర్.

ఆ మాటల్లోని మర్మం తెలియని చిన్న పిల్లేమీ కాదు ఆ యాంకర్.  మేటర్ అర్థమైపోయింది. బయటకొచ్చి నలుగురి ముందు చెప్పుకొని చాలా బాధపడింది. సీనియర్ నటుడు అనుకున్నాను కానీ ఇంత ఇది అనుకోలేదంటూ ఏడ్చినంత పనిచేసిందట.