కూతురికి నిశ్చితార్థం చేసిన రఘు

Raghu Kunche's daughter gets engaged
Saturday, May 30, 2020 - 22:00

రఘు కుంచె మొహం చూస్తే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉందంటే నమ్మలేం. కానీ రఘుకుంచెకు అలాంటి అమ్మాయి ఉంది. అంతేకాదు, తన కూతురికి ఈరోజు నిశ్చితార్థం కూడా నిర్వహించాడు ఈ సంగీత దర్శకుడు.

రఘు కుంచె, కరుణ దంపతులకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు రాగ పుష్యమి. అబ్బాయి పేరు గీతార్థ్. వీళ్లో రాగ పుష్యమికి, ఆశిష్ వర్మతో నిశ్చితార్థం జరిపించాడు రఘు. ఈ వేడుకకు అత్యంత సమీప బంధువులు మాత్రమే హాజరయ్యారు.

రఘుది తూర్పుగోదావరి జిల్లా. సింగర్ అవుదామని ఇండస్ట్రీకొచ్చిన రఘు కుంచె ఎన్నో అవతారాలెత్తాడు. మంచి హిట్ సాంగ్స్ పాడడంతో పాటు డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా కూడా మారాడు. కెరీర్ లో 5 నంది అవార్డులు అందుకున్న ఈ ఆల్ రౌండర్.. రీసెంట్ గా వచ్చిన పలాస సినిమాతో విలన్ గా కూడా మారాడు.