జి తెలుగు ఖాతాలో రాహు

Rahu satellite rights sold
Monday, February 10, 2020 - 20:45

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ మెయిన్ రోల్స్ లో నటిస్తున్న మూవీ... రాహు. ఈ సినిమా చిన్న సినిమాల దర్శక, నిర్మాతలకి ఒక కొత్త మార్గాన్ని చూపింది. ఎలా బిజినెస్ చేసుకోవాలో చెపుతోంది. 

చిన్న సినిమాలకు శాటిలైట్ రైట్స్ విడుదలకు ముందే అమ్ముడవడం అనేది గగనంగా మారిన ట్రెండ్ లో రాహు సినిమాకి సంబదించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రెట్లు కు అమ్మడయ్యాయి. సిధ్ శ్రీరామ్ పాడిన ‘ఎమో ఎమో’ పాట  7 మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది. ఈ పాట  ‘రాహు’ కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. 

‘రాహు శాటిలైట్, డిజిటల్ హాక్కులు జి తెలుగు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా పై మాకున్న నమ్మకం మరింత పెరిగింది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ‘రాహు’ థ్రిల్లర్ మూవీస్ లో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతుంది,’’  అన్నారు దర్శకుడు సుబ్బు వేదుల.