రాహుల్, పున్నూ మధ్య ఏమి లేదా?

Rahul and Punarnavi, what's cooking?
Monday, February 17, 2020 - 09:15

రాహుల్, పునర్నవి కథ అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ లో కలిసిన ఈ జోడీ.. అప్పట్నుంచి తామిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు కలరింగ్ ఇచ్చింది. బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ గెలవడానికి పునర్నవి అప్పట్లో పడిన కష్టం అంతా ఇంతా కాదు. మొత్తానికి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అంతా అనుకుంటే.. బయటకొచ్చిన తర్వాత మాత్రం తామిద్దరి మధ్య ఏమీలేదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.తాజాగా పునర్నవి, వేరే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టు కూడా ప్రకటించుకుంది.

అంత వరకు బానే ఉన్నా.. మొన్న మళ్ళీ సర్ప్రైజ్ చేశారు. ఇద్దరూ వాలంటైన్స్ డే రోజున కలిశారు. వాలంటైన్స్ డే ను వరుణ్-వితికతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. రాహుల్-పున్నూ కలిసి ప్రేమికుల రోజును కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. కానీ వీరు ప్రేమికులు కాదంట.

మరి ఇంతకీ ఇద్దరి మధ్య ఏముందబ్బా!ఏమి లేదు అంటూనే ఎదో ఉంది అనుకునేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు.