పునర్నవి బాగా కోపరేట్ చేస్తోంది

Rahul plans music album with Punrnavi
Wednesday, November 27, 2019 - 07:15

మీ ఇద్దరి మధ్య ఏముంది?
బిగ్ బాస్ విజేతగా నిలిచిన రాహుల్ కు ఎక్కడికెళ్లినా కామన్ గా ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చిన రాహుల్.. ఈసారి కాస్త కొత్తగా రియాక్ట్ అయ్యాడు. పునర్నవితో తన అసలైన కెమిస్ట్రీని త్వరలోనే చూడబోతున్నారని ప్రకటించాడు.

"నేను, పునర్నవి ఓ ఆల్బమ్ చేస్తున్నాం. బయట మా కెమిస్ట్రీ జబర్దస్త్ రీచ్ అయిందట. మా మధ్య ఏముందని అంతా అడుగుతున్నారు. బయట మా మధ్య ఏం లేదు కానీ సాంగ్ లో మాత్రం మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుంది. అది మాత్రం పక్కా. పున్నూ బాగా కోపరేట్ చేస్తోంది."

ఇలా తామిద్దరం కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేస్తున్న విషయాన్ని బయటపెట్టాడు రాహుల్. వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. అంతకంటే ముందు ఇలా మ్యూజిక్ వీడియోతో ట్రీట్ ఇవ్వబోతోంది ఈ జంట.