నేను రేప్ కి గురయ్యా: రాహుల్

Rahul Ramakrishna says he was raped
Monday, January 20, 2020 - 19:00

రాహుల్ రామకృష్ణ అంటే నవ్వులు. కామెడీ పండించడంలో అతనిది వెరైటీ శైలీ. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైంలైట్ లోకి వచ్చిన ఈ యువ కమెడియన్ తాజాగా అల వైకుంఠపురంలోనూ మెరిశాడు. రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ లో చాలా ఆక్టివ్. మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతుంటాడు.  సోషల్ ఇష్యూస్ పై బాగా స్పందిస్తుంటాడు. ఐతే తాజాగా అతను ఉన్నట్లు ఉండి పెట్టిన ఒక మెసేజ్ కలకలం రేపింది. 

తాను చిన్నప్పుడు రేప్ కి గురయ్యాను అని ట్వీట్ చేశాడు. "నా చిన్నతనంలో నేను రేప్ కి గురయ్యా. నా క్షోభ ఏంటో ఎలా చెప్పాలో తెలియదు. జరిగిన విషయం మాత్రమే తెలుసు. ప్రతిదీ బాధిస్తూనే ఉంటుంది." అంటూ ఇంగ్లీష్ లో ట్వీట్ చేశాడు. రాహుల్ ఈ విషయాన్నీ ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో బయట పెట్టాడు. అయితే , సడెన్ గా ఎందుకు ట్వీటాడో తెలియదు. 

రాహుల్... తెలంగాణ యాసలో నేచురల్ గా డైలాగ్స్ చెప్తాడు. తెలుగులో ఇప్పుడు బిజీ కమెడియన్.