"ఆ నా *#@ ...బీర్ బాటిల్ తో కొట్టారు"

Rahul says he was attacked with beer bottles
Thursday, March 5, 2020 - 18:00

బుధవారం రాత్రి తనపై జరిగిన దాడిపై సింగర్, బిగ్ బాస్ సీజన్ -3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ఎమ్మెల్యే తమ్ముడు దాడిచేశాడంటూ ఉదయం నుంచి వస్తున్న వార్తల్ని రాహుల్ సమర్థించాడు. తనపై రాకేష్ రెడ్డి అనే వ్యక్తి దాడిచేశాడని ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ కూడా ఇచ్చానని స్పష్టంచేశాడు. రాత్రి దాడి ఎలా జరిగిందో వివరించాడు.

"అది పబ్ క్లోజింగ్ టైమ్. సాధారణంగా క్లోజ్ చేసే టైమ్ కు పోలీస్ ఉంటాడు. రాత్రి కూడా ఉన్నాడు. వాష్ రూమ్ నుంచి ముగ్గురు బయటకొచ్చారు. వస్తూనే పక్కనే ఉన్న అమ్మాయిల్ని కామెంట్ చేస్తున్నారు. నన్ను కూడా పక్కకు తోశారు. నేను చేయి పట్టుకున్నాను. అంతే, వెంటనే నన్ను కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. నా ఇగో హర్ట్ అయింది. నేను ప్రశ్నించాను. అంతే.. అంతా కలిసి నాపై దాడిచేశారు. బీర్ బాటిల్ తో తలపై కొట్టారు."

తనకు  దెబ్బ తగలగానే హాస్పిటల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయడం లేట్ అయిందంటున్నాడు రాహుల్. హాస్పిటల్ ను డిశ్చార్జ్ అయిన వెంటనే తిరిగి అదే పబ్ కు వెళ్లానని, సీసీ టీవీ ఫూటేజ్ ను తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశానంటున్నాడు రాహుల్.

తనపై దాడి చేసిన వ్యక్తులకు, తనకు పాత కక్షలు లేవంటున్నాడు రాహుల్. గతంలో వాళ్లను చూడలేదని కూడా చెబుతున్నాడు. కేవలం ఫ్రీ పబ్లిసిటీ కోసమే వాళ్లు తనపై దాడి చేసి ఉంటారని అభిప్రాయపడ్డాడు.