రాహుల్-పునర్నవి హీరోహీరోయిన్లుగా సినిమా

Rahul Sipligunj wants to act with Punarnavi Bhoopalam
Tuesday, November 12, 2019 - 18:15

బిగ్ బాస్ పుణ్యమా అని వీళ్లిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో యమ పాపులర్ అయిపోయారు. దీనికి తోడు వీళ్లిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతాహై అంటూ అప్పట్లో వచ్చిన పుకార్లు, వీళ్లకు పిచ్చ పబ్లిసిటీ తీసుకొచ్చిపెట్టాయి. కట్ చేస్తే, పునర్నవి హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వగా, రాహుల్ ఏకంగా సీజన్3 విన్నరా గా నిలిచాడు.

అలా హౌజ్ నుంచి బయటకొచ్చిన వీళ్లిద్దరూ ఇప్పుడు బయట కూడా అంతే క్లోజ్ గా ఉంటున్నారు. తమ మధ్య ఏం లేదని, ఇద్దరూ ఖండిస్తున్నప్పటికీ పార్టీలు, ఛాటింగ్ లు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా రాహుల్ చేసిన ఓ ప్రపోజల్.. వీళ్లిద్దరి ఎఫైర్ గాసిప్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. రాహుల్ వెర్షన్ ఇలా ఉంది.

"నాకు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ పునర్నవితో సినిమా అవకాశం వస్తే మాత్రం వదులుకోను. పున్నూ హీరోయిన్ గా, నన్ను హీరోగా పెట్టి ఎవరైనా సినిమా తీస్తే మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకోను. 110శాతం కచ్చితంగా చేస్తా."

చూశారుగా రాహుల్ ఎక్సైట్ మెంట్ ఈ రేంజ్ లో ఉంది. పున్నూకు తనకు మధ్య ఏం లేదని చెబుతూనే, ఆమె హీరోయిన్ గా, తను హీరోగా సినిమా ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనంటున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరికీ క్రేజ్ ఉంది కాబట్టి, చిన్న నిర్మాతలు ఎవరైనా ఈ దిశగా ఆలోచిస్తే బెటరేమో