రాజ్ తరుణ్, హెబ్బా పెళ్లి చేసుకుంటారా?

Raj Tarun and Hebbah Patel: Will they get married?
Wednesday, May 31, 2017 - 17:30

ఎన్ని సార్లు ఖండించినా, ఎంత మొత్తుకున్నా ఈ రూమర్ మాత్రం ఆగట్లేదు. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా ఓ రేంజ్ లో కెమిస్ట్రీ నడుస్తోంది. అందుకే రాజ్ తరుణ్, హెబ్బా పెళ్లిచేసుకుంటారేమో అనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. దానికి తోడు రిలీజ్ కు రెడీ అవుతున్న 'అంధగాడు' సినిమాలో కూడా ఈ జోడీనే మరోసారి రిపీట్ అవ్వడంతో రూమర్లకు మంచి బలం వచ్చింది.

ఈ విషయంపై రాజ్ తరుణ్ చాలా క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆ క్లారిటీ అదోలా ఉంది. పూర్తిగా ఖండించినట్టు కనిపించడం లేదు. అలా అని ఒప్పుకున్నట్టు అనిపించడం లేదు. హెబ్బాతో 30 సినిమాలు చేయాలని ఉందని, ఆమె పక్కనుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించాడు రాజ్ తరుణ్. కానీ తామిద్దరి మధ్య “కుచ్ కుచ్ హోతా హై” లాంటిది ఏదీ లేదంటాడు. హెబ్బా లేకుండా ఉండలేనంటాడు. కానీ హెబ్బాతో రిలేషన్ షిప్ అంటూ వార్తలు రాయొద్దంటాడు.

హెబ్బా పటేల్ ను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా అనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రస్తుతానికైతే వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఇద్దరూ కామన్ గా చెబుతున్న స్టేట్ మెంట్ ఇది. అయితే తాజాగా వస్తున్న మరో రూమర్ ఏంటంటే.. వీళ్లిద్దరూ ప్రస్తుతం ఒకర్నొకరు అర్థంచేసుకునే ప్రాసెస్ లో ఉన్నారట. కలిసి సినిమాలు చేయడం ఆపేవరకు ఈ పుకార్లు ఇలా వస్తూనే ఉంటాయేమో.