రాజ్ తరుణ్ కెరీర్ ఇక లేవగలదా?

Raj Tarun fails to bring even openings
Sunday, December 29, 2019 - 17:15

రాజ్ తరుణ్ కెరీర్ మరీ ఘోరంగా పడిపోయింది. ఇక అతను మళ్ళీ పుంజుకోగలడా.. అన్న రేంజ్ లో దిగజారింది కెరీర్. హిట్స్, ప్లాప్స్ అనే విషయాన్నే పక్కన పెడితే ....కనీసం ఓపెనింగ్స్ సైతం రాబట్టలేకపోతున్నాడు. 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అయింది.  తొలి 5 రోజులకి గాను అర కోటి షేర్ కూడా దాటేలా లేదు. మరి ఇంత హీనంగా కలెక్షన్లు ఉంటె... తర్వాత తీసే నిర్మాతల సీన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

రాజ్ తరుణ్ తో ఇప్పుడు సినిమా తీయాలంటే... కోటి రూపాయలకి మించి బడ్జెట్ పెట్టలేని పరిస్థితి. మంచి టాలెంట్ ఉన్న ఈ కుర్ర హీరో.. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని... చక్కదిద్దుకోవాలి. రాజ్ తరుణ్ ఖాతాలో ఇది వరుసగా ఐదో అట్టర్ ప్లాప్. దిల్ రాజు ... ఈ హీరో తో తీసిన రెండు చిత్రాలూ ('లవర్', 'ఇద్దరి లోకం ఒకటే') దారుణంగా పోయాయి.

|

Error

The website encountered an unexpected error. Please try again later.