బ్రహ్మీ కొడుకు ఫేట్ అంతే!

కమెడియన్‌లలో లెజెండ్ స్టేటస్ పొందిన నటుడు..బ్రహ్మానందం. బ్రహ్మి కుమారుడు రాజా గౌతమ్ కూడా తండ్రి బాటలోనే నటుడిగా మారాడు కానీ అతనికి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా కలిసిరాలేదు. చాలా గ్యాప్ తర్వాత మను అనే సినిమాతో మరోసారి లక్ పరీక్షించుకున్నాడు. కానీ ఫేట్ మాత్రం మారలేదు. గత వీకెండ్ విడుదలైన మను ఫ్లాప్ అయింది. రాజా గౌతమ్ ఖాతాలో మరోటి చేరింది.
"పల్లకీలో పెళ్లికూతురు" సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు బ్రహ్మానందం కొడుకు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత "బసంతి", "చారుశీల" వంటి సినిమాలు కూడా వచ్చాయి. అవి కూడా బోల్తాకొట్టాయి. రాజా గౌతమ్‌కి అందమైన లుక్స్ లేవు. తండ్రిలా కమెడియన్ కాదు. నటుడిగా - డ్యాన్స్‌కానీ, అందంకానీ, యాక్షన్ కానీ...ఇలా దేంట్లోని ఏ ప్రత్యేకతలు లేవు. అందుకే రాజా గౌతమ్ ఇప్పటి వరకు నిలదొక్కుకోలేదు.
టాలీవుడ్‌లో అత్యంత వేగంగా క్రౌడ్ ఫండింగ్ (తలా ఒకరు కొంత ఎమౌంట్‌ని పెట్టుబడి పెట్టి..సినిమా నిర్మాణంలో పాలు పంచుకోవడమే క్రౌడ్ ఫండింగ్.) జరుపుకున్న సినిమా అని "మను" ఊదరగొట్టింది రిలీజ్‌కి ముందు. సోషల్ మీడియాలో చాలా హైప్ క్రియేట్ అయింది. ఐతే దెయ్యాల కథకి దర్శకుడు అంత హడావుడి చేయడం, అదీ కూడా 3 గంటల పాటు నస పెట్టడంతో మొదటి ఆటకే హైప్ తుస్సుమంది. అలా రాజా గౌతమ్‌కి మరోసారి లక్ టర్న్ కాలేదు.
- Log in to post comments