రాజ‌మౌళి నెక్స్‌ట్ మూవీ హీరో అత‌నే!

Rajamouli to direct his next film with that hero
Tuesday, May 9, 2017 - 15:45

రాజ‌మౌళి నెక్స్‌ట్ మూవీ గురించి ఎంతో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.  ఫ్రాంక్‌గా చెప్పాలంటే నెక్స్‌ట్ ఏంటి అనే విష‌యంలో రాజ‌మౌళి కూడా సీరియ‌స్‌గా థింక్ చేయ‌లేదు. ఎందుకంటే ఆయ‌న మూడ్ అంతా ఇపుడు కొంత విశ్రాంతి తీసుకోవ‌డ‌మే. ప్ర‌స్తుతం లండ‌న్ విహార యాత్ర‌లో ఉన్నాడు. ఇండియాకి వ‌చ్చిన త‌ర్వాత వెంట‌నే భూటాన్ వెళ్తాడు. అంటే ఇంకో రెండు నెల‌లు సినిమా గురించి ఊసే ఎత్త‌డు. 

అయితే, రాజ‌మౌళి స‌న్నిహితులు తెలుగుసినిమా.కామ్‌కి చెప్పిన మేట‌ర్ ప్ర‌కారం...మ‌ళ్లీ ప్ర‌భాస్ హీరోగానే ఒక భారీ సినిమా తీస్తే ఎలా ఉంటుంద‌ని రాజ‌మౌళి త‌న టీమ్‌ని అడిగాడ‌ట‌. ఈ ప్ర‌శ్న వేసి ఆయ‌న ఫ్ల‌యిట్ ఎక్కాడ‌ట‌. దానికి వారు ఇంకా ఆన్స‌ర్ ఇవ్వ‌లేదు. 

వారిచ్చే జావాబు ఏంటో ఎవ‌రైనా ఊహించొచ్చు. అద‌న్న‌మాట సంగతి. ఏదీ క‌న్‌ఫ‌మ్ కాదు. ప్ర‌స్తుతానికి అన్ని ఊహాగానాలే.