పవన్ పేరుచెప్పగానే సెంటర్ లో కొట్టాడు

Rajamouli targets Pawan Kalyan?
Thursday, June 22, 2017 - 20:45

రాజమౌళి-పవన్ కల్యాణ్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుకుంటున్నాయా? రాజమౌళికి కూడా అదే ఫీలింగ్ ఉందేమో. అందుకే పవర్ స్టార్ పేరు చెప్పగానే గురి చూసి మరీ సెంటర్ లో కొట్టాడు. త్వరలోనే టెలికాస్ట్ కాబోతున్న ఓ షోలో ఈ సీన్ భలేగా పండింది.

రానా హోస్ట్ గా జెమినీ టెలివిజన్ లో ఈనెల 25 నుంచి ఓ కార్యక్రమం షురూ కానుంది.

మొదటి కార్యక్రమాన్ని తనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన రాజమౌళితో స్టార్ట్ చేశాడు. అందులో ఉండే చిన్న చిన్న గేమ్స్ లో భాగంగా.. కాస్త దూరంలో టార్గెట్ పెట్టి రాజమౌళికి విల్లు,బాణాలు అందించాడు. ఒక్కో హీరో పేరు చెప్పినప్పుడు బాణం వదలాలి. టార్గెట్ కు అది ఏ ప్లేస్ లో తగుల్తుందో చూడాలి. అది కాన్సెప్ట్ అన్నమాట. ఏ హీరోకు టార్గెట్ రీచ్ కాలేదు. కానీ పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే.. బాణం సరిగ్గా వెళ్లి సెంటర్ లో తగిలింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్. ఈ ఇన్సిడెంట్ నే ప్రోమోగా కట్ చేసి రిలీజ్ చేశారు.