పుకార్లకు జక్కన్న తెరదించేది ఎప్పుడు?

Rajamouli is unsure about release date
Sunday, November 24, 2019 - 10:30

సినిమాలో సెకెండ్ హీరోయిన్ ను ప్రకటించారు. మరో ఇద్దరు విలన్ పాత్రల్ని పరిచయం చేశారు. 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నామని కూడా చెప్పారు. షూటింగ్ 70శాతం పూర్తయిందని కూడా ప్రకటించారు. ఇన్ని విషయాల్ని చెప్పిన రాజమౌళి.. తన సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం ప్రకటించలేకపోతున్నారు. అవును.. RRR విడుదల తేదీపై యూనిట్ స్పష్టత ఇవ్వడం లేదు.

నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఏడాది కిందటే ప్రకటించారు. 2020 జులై 30న సినిమాను రిలీజ్ చేస్తామని ఘనంగా ప్రకటించారు. పోస్టర్ కూడా విడుదల చేశారు అప్పట్లో. కానీ అదే తేదీని ఇప్పుడు మరోసారి చెప్పలేకపోతున్నారు. జులై 30నే పక్కాగా వస్తామని క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. రిలీజ్ డేట్ పై రాజమౌళి ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారట.

దీనికి కారణం షూటింగ్ లో జాప్యం ఒకటైతే.. రెండోది రీషూట్స్ వ్యవహారం. లెక్కప్రకారం, సినిమా షూటింగ్ ఈపాటికి 90శాతం పూర్తవ్వాలి. జనవరి నుంచి కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే ఉండాలి. కానీ ఇప్పటివరకు 70శాతం మాత్రమే పూర్తయింది. పైగా షూట్ మొత్తం పూర్తయిన తర్వాత రీషూట్స్ కూడా పెట్టుకుంటాడు రాజమౌళి. అందుకే విడుదల తేదీపై ఇప్పట్లో క్లారిటీ రావడం లేదు.

బాహుబలి-1, బాహుబలి-2 విడుదల తేదీల విషయంలో అనుకున్నది అనుకున్నట్టు చేసిన రాజమౌళి.. RRR విషయంలో మాత్రం కాస్త డౌట్ గానే ఉన్నట్లు ఉంది. జనవరి చివరి నాటికి ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.