లాక్ డౌన్ లో రాజమౌళి పని ఇది

Rajamouli work schedule during lockdown
Saturday, April 18, 2020 - 15:15

ఈ లాక్ డౌన్ టైమ్ లో ప్రముఖులంతా ఇళ్లకే పరిమితమైపోయారు. కొందరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమా పనులతో బిజీగా ఉన్నారు. రాజమౌళి రెండో టైపు. లాక్ డౌన్ లో కూడా సినిమా వదల్లేదు ఈ దర్శకుడు. ఓవైపు ఆర్ఆర్ఆర్ పనుల్ని సమన్వయం చేసుకుంటూనే, మరోవైపు కొత్త స్టోరీల మీద వర్క్ చేస్తున్నాడు.

"ఆర్ఆర్ఆర్ కు సంబంధించి పేపర్ వర్క్ ఏంలేదు. ఎందుకంటే దాదాపు సినిమా షూట్ సగం అయిపోయింది కాబట్టి పేపర్ వర్క్ లేదు. అంతా ఎగ్జిక్యూషన్ వర్కే. ప్రస్తుతం ఆన్ లైన్లోనే మిగతా పనులకు సంబంధించి రివ్యూస్ ఇస్తున్నాను, కరెక్షన్లు చెబుతున్నాను. మా నాన్నగారు ఆయన ఆఫీస్ లోనే ఉండిపోయారు. మా అన్నయ్య రాజమండ్రిలో ఉన్నాడు. మేం ముగ్గురు ఆన్ లైన్లో వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటున్నాం. డిఫరెంట్ స్టోరీస్ డెవలప్ చేస్తున్నాం. ఒకవేళ లాక్ డౌన్ ను పాక్షికంగా ఎత్తేస్తే, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తక్కువ సిబ్బందితో ఎలా పని పూర్తిచేయాలనే అంశంపై కూడా వర్క్ చేస్తున్నాను."

ఉదయం ఇంట్లో భార్య ఆదేశాల ప్రకారం నడుచుకుంటాడట రాజమౌళి. ఆమె చెప్పిన ప్రకారం ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతుక్కోవడం లాంటి పనులు చేస్తున్నాడట. మధ్యాహ్నం నుంచి సినిమా పనుల్లో పడుతున్నట్టు తెలిపాడు.

మరోవైపు వచ్చేనెలలో రిలీజ్ చేయనున్న ఎన్టీఆర్ టీజర్ పై కూడా స్పందించాడు రాజమౌళి. టీజర్ కు సంబంధించి ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందని ప్రకటించాడు. లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ కు అనుమతి ఇస్తే తప్ప టీజర్ వచ్చే పరిస్థితి లేదని అంటున్నాడు.