రాజ‌మౌళి కొత్త ల‌గ్జ‌రీ కారు ఇదే

This is Rajamouli's new luxury BMW car
Wednesday, June 21, 2017 - 16:15

'బాహుబ‌లి 2' సినిమాతో ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి స్థాయి, పాపులారిటీ పెరిగాయి. ఆయ‌న ఇపుడు ఇండియాలోనే నెంబ‌ర్‌వ‌న్ డైర‌క్ట‌ర్‌. 'బాహుబ‌లి 2'తో ఆయ‌న వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అందుకే ఇపుడు త‌న లైఫ్‌స్ట‌యిల్లో కొంత మార్చుకోక త‌ప్ప‌డం లేదు. మునుప‌టిలా మరీ సాదాసీదా కారులో ప్ర‌యాణిస్తే ..అంత సంపాదించి ఏం చేసుకుంటార‌ని అంటారు. అందుకే ఆయ‌న ఇపుడు కొత్త‌గా ఒక ఫామ్‌హౌస్ క‌డుతున్నాడు. అలాగే కారుని మార్చాడు.

మొద‌టిసారిగా ఆయ‌న కోట్ల రూపాయ‌ల విలువ చేసే ల‌గ్జ‌రీ కారుని కొన్నాడు. బీఎండబ్ల్యూ కి చెందిన బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కారుని ఆయన కొనుగోలు చేశాడు. దీని ధర దాదాపు కోటిన్నర పైనే. ఇటీవ‌ల షోరూం నిర్వాహ‌కులు ఆయ‌న ఇంటికి వ‌చ్చి కారుని అంద‌చేశారు. అదే ఈ ఫోటో. 

ప్ర‌స్తుతం రాజ‌మౌళి హైద‌రాబాద్‌లోని మ‌ణికొండ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తున్నాడు. కానీ త్వ‌ర‌లోనే ఆయ‌న హైద‌రాబాద్ శివారుల‌లోని ఫామ్‌హౌస్‌కి షిప్ట్ అవుతాడ‌ట‌. ఆర్ట్ డైర‌క్ట‌ర్ ర‌వీంద‌ర్ డిజైన్‌తో వంద ఎక‌రాల‌లో ఫామ్‌హౌస్‌ని నిర్మిస్తున్నాడు రాజ‌మౌళి.