రాజమౌళి దర్శకత్వంలో రజనీ? ఇది అయ్యేనా?

ఇలా చెప్పుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా... అలాంటిది తెరపై చూస్తే స్క్రీన్ చిరిగిపోవాల్సిందే. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఈ కాంబినేన్ కిర్రాక్ పుట్టించడం ఖాయం. ప్రస్తుతం గాసిప్ లెవెల్లో ఉన్న ఈ కాంబోను రియాలిటీలోకి తీసుకురావడానికి కొందరు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. బాహుబలి 2తో పెరిగిన రాజమౌళి రేంజ్ ను, సూపర్ స్టార్ క్రేజ్ తో జతచేయాలని చూస్తున్నారు కొందరు. ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు ఎన్ని వందల కోట్లు పెట్టడానికైనా రెడీ అవుతున్నారు. ఎందుకంటే, బాహుబలి 2 తర్వాత రాజమౌళి-రజనీకాంత్ కాంబో అంటే కలెక్షన్ల సునామినే.
ప్రస్తుతానికి రాజమౌళి మైండ్ లో (అతడు చెప్పేదాని ప్రకారం) ఏమీ లేదు. కొన్ని రోజులు రిలాక్స్ అయిన తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తానని ప్రకటించాడు. అయితే కొందరు మాత్రం రిలాక్స్ అవ్వడం లేదు. రాజమౌళికి క్లోజ్ గా ఉండే కోటరీ మొత్తాన్ని కెలికేస్తున్నారు. వాళ్లను ఊరికే లంచ్ కు పిలుస్తున్నారు. సందర్భం లేకపోయినా గిఫ్టులు కొనిస్తున్నారు. మరి వీళ్ల లాబీయింగ్ లు పనిచేస్తాయా.. తన సన్నిహితులు చెప్పే సినిమాకు రాజమౌళి ఒప్పుకుంటాడా.. అసలు రజనీకాంత్ డేట్స్ ఇస్తాడా.. ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్రశ్నలే.
మరోవైపు, సోమవారం (మే 15) తన అభిమాన సంఘాల ప్రతినిధులు, అభిమానులతో రజనీకాంత్ చెన్నైలో సమావేశం అయ్యాడు. అక్కడ తన అభిప్రాయాలను వెల్లడించాడు. దేవుడు ఆదేశిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు టైప్‌లో దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా అనే స్టాక్ డైలాగ్‌ని మరోసారి వదిలాడు రజనీకాంత్.
- Log in to post comments