రజనీది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

2.0 (టూ పాయింట్ ఓ) ట్రయిలర్ వచ్చేసింది. ఈ ట్రయిలర్ లాంచ్ ఈవెంట్‌లో రజనీకాంత్ శంకర్‌ని తెగ పొగిడేశాడు. ఈ సినిమాకి జనం నన్ను చూసి రారు శంకర్ పేరు వల్లే వస్తారన్నట్లుగా మాట్లాడాడు. అంతేకాదు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పాడు.
"సుభాష్‌కరణ్‌కి, శంకర్‌కి అడ్వాన్స్ కంగ్రాట్స్. నిర్మాత 600 కోట్లు పెట్టారు. శంకర్‌ని నమ్మి పెట్టారు. అంతేగానీ నామీదో, అక్షయ్‌కుమార్ మీదో కాదు. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్, నిర్మాతల ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎప్పుడూ రీచ్ అవుతూనే ఉన్నారు శంకర్. కొన్నిసార్లు తప్పి ఉండవచ్చు. అయినా అతను మెజీషియన్. అతను చాలా గొప్ప డైరక్టర్. ఏదో రూ.600కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్ అని నేను చెప్పడం లేదు. అందరూ కష్టపడతారు. అయినా అన్నిసార్లు వర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వర్కవుట్లు అవుతాయి. ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి", ఇలా పొగిడేశాడు రజనీకాంత్.
టూ పాయింట్ ఓని దాదాపు 600 కోట్ల రూపాయలతో నిర్మించారట. అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా? రజనీకాంత్ మాత్రం అవుతుందని అంటున్నాడు.
"'శివాజీ' చేసేటపుడు ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపయింది. విడుదల సమయంలో ఇంకా ఎక్కువైంది. కానీ ఆ సినిమాకు అంత కన్నా ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. 'శివాజీ' ఎంత కలెక్ట్ చేసిందో, అంత బడ్జెట్ వేశారు 'రోబో'కి. సన్ పిక్చర్స్ వాళ్లు.. దానికన్నా 20-30 పర్సెంట్ బడ్జెట్ ఎక్కువయింది. అయినా కలెక్ట్ అయింది. 'రోబో' కలెక్ట్ చేసినంత ఈ సినిమాకు వస్తే చాలు అని '2.0' మొదలుపెట్టాం. అందుకే ముందు రూ.300కోట్లు అనుకున్నాం. ఇప్పుడు డబుల్ అయింది. తప్పకుండా అంతకు డబుల్ కలెక్ట్ చేస్తుంది," ఇలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు రజనీ.
- Log in to post comments