వెనక్కి తగ్గను... రజినీ స్ట్రాంగ్ మాట

Rajinikanth refuses to offer apology on Periyar issue
Tuesday, January 21, 2020 - 14:15

సూపర్ స్టార్ రజినీకాంత్ చుట్టూ తమిళనాట రాజకీయ దుమారం రేగుతోంది. తమిళనాట అభ్యుదయవాది గా పేరొందిన పెరియార్ పై రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచనలం రేపాయి. హిందువులకి వ్యతిరేకంగా పెరియార్ పనిచేశారన్నట్లుగా రజిని మాట్లాడారు. దాంతో అక్కడ దుమారం రేగుతోంది. రజినీకాంత్ పక్కా బీజేపీ మనిషి అనే ముద్ర పడింది. రజినీకాంత్ క్షమాపణ చెప్పాలని డీఎంకే, ఇతర పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, తాను తప్పు మాట్లాడలేదు అని, తన మాటలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టంగా చెప్పారు రజిని.

'తుగ్లక్' అనే మేగజైన్ కి సంబంధించిన కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రజినీకాంత్ ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నాడు. అయితే, రజినీకాంత్ కి బీజేపీ ముద్ర పడింది కాబట్టి అక్కడ నెగ్గడం కష్టం అనే వాదన వుంది. రజినీకాంత్ రీసెంట్ సినిమాల కలెక్షన్లు తగ్గడానికి అదే రీజన్. తమిళనాట ఇప్పుడు విజయ్ సినిమాలు, అజిత్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. 

విజయ్ ... బీజేపీకి యాంటీగా తన సినిమాల్లో డైలాగ్స్ పెడుతున్నాడు కూడా.