బ్రైడ్ మోడ్‌లోకి సౌందర్య

రజనీకాంత్ రెండో కూతురు రెండోసారి పెళ్లికూతురు అవుతోంది. మొదటి పెళ్లి డివోర్స్‌తో ఎండ్ కావడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంటోంది. తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించే ప్రముఖ వ్యాపారవేత్త విషగన్‌ని పెళ్లాడనుంది. ఫిబ్రవరి 11న ఆమె పెళ్లి.
తాజాగా ఆమె తన ఫోటోని షేర్ చేసింది. పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వధువు అవతారంలోకి మారిపోయా. మరో వారంలోనే పెళ్లి అంటూ ఆమె ట్వీట్ చేసింది.
రజనీకాంత్ రెండో కూతురు తన తండ్రి హీరోగా పలు సినిమాలు నిర్మించింది. విక్రమసింహ సినిమాని డైరక్ట్ చేసింది. మొదటి వివాహం ద్వారా ఆమెకి వేద్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఈ వివాహ వేడుకని సింపుల్‌గా నిర్వహిస్తారట.
#OneWeekToGo #BrideMode #Blessed #VedVishaganSoundarya #Family ❤️❤️❤️ pic.twitter.com/fJYkHp8J1l
— soundarya rajnikanth (@soundaryaarajni) February 4, 2019
- Log in to post comments

























