ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను చంపేస్తామంటున్నారు

Rakesh Master says he is getting threatening calls from NTR fans
Monday, March 2, 2020 - 14:15

నోరు అదుపులో పెట్టుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో రాజకీయాలు, సినిమాల్లో నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి చేదు అనుభవమే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అలియాస్ రామారావుకు ఎదురైంది. ప్రస్తుతం ఇతడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వస్తున్నాయట. చంపేస్తామంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారట. ఈ మేరకు తనకు రక్షణ కావాలంటూ బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించాడు రాకేష్ మాస్టర్.

సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే జనాల ఎటెన్షన్ ను ఈజీగా లాక్కోవచ్చు. నాలుగు వ్యూస్ తో పాటు కాస్త పాపులారిటీ కూడా వస్తుందనేది చాలామంది అభిప్రాయం. రాకేష్ మాస్టర్ కూడా ఆ బాపతే. ఎన్టీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఎన్టీఆర్ కు తన తాత ఏడాదికి ఒకసారి మాత్రమే గుర్తొస్తాడని ఆరోపించాడు రాకేష్. సమాధి దగ్గర మాత్రమే తాతను తలుచుకుంటాడని, తర్వాత అతడికి తాత గుర్తుకురాడని ఎద్దేవా చేశాడు.

ఈ వ్యాఖ్యలపై తారక్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్టున్నారు. అలా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటున్నాడు రాకేష్ మాస్టర్. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షించాలని పోలీసుల్ని ఆశ్రయించాడు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే ముందు శ్రీరెడ్డి ఫ్యాన్స్, ఆమె అనుచరులు తనను చంపే ప్రమాదముందంటున్నాడు రాకేష్. ఎందుకంటే ఎన్టీఆర్ కంటే ఎక్కువగా శ్రీరెడ్డినే తిట్టాడు ఈయన. అప్పుడు తిట్టడం ఎందుకో, ఇప్పుడు భయపడ్డం ఎందుకో!