ఎక్కిస్తా... కోర్టు మెట్లెక్కిస్తా: మాధవీలత!

Rakesh master vs Madhavilatha
Wednesday, May 27, 2020 - 23:00

కనపడ్డ ప్రతి సినిమా సెలబ్రిటీపై విరుచుకుపడే డాన్స్ మాస్టర్ రాకేష్ ..... యూట్యూబ్ చానెల్స్ కి ఒక వరం. వాళ్ళకి కావలిసినంత "స్టఫ్" ఇస్తూ ఉంటాడు తన ఇంటర్వ్యూలతో. కెమెరా వైపు చూస్తూ... తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ, పేరొందిన ప్రతి హీరో, హీరోయిన్ పై విమర్శలు చేసే రాకేష్ ని కోర్టు మెట్లెక్కిస్తా అంటోంది ఒకప్పటి హీరోయిన్, నేటి బీజేపీ 'నాయకురాలు' పసుపులేటి మాధవీలత.

ఆమెపై అవాకులు చెవాకులు పేలడట. కాబట్టి అతన్ని వదలను, కోర్టులో తేల్చుకుంటా అని శపథం చేసింది మాధవీలత. "రాకేష్ లా నేను కూడా మాట్లాడితే, అతనికి ముఖం చెల్లదు. కానీ నేను పరువు నష్టం దావా వేసి ...లీగల్ గా పోరాడాలని అనుకుంటున్నాను. నాకు క్షమాపణ చెప్పే వరకు వదలను," అని చెప్పింది మాధవీలత.

మరి రాకేష్ మాస్టర్ సమాధానం ఏమి ఇస్తాడో చూడాలి. "నన్ను ఏమి చేస్తారు.... నాకున్నదే బోడిగుండు...."  అని తనదైన స్టైల్ లో మాటల తూటా విసురుతాడా లేక క్షమాపణ చెప్తాడా? చూస్తూనే ఉండండి నిరంతర సోషల్ మీడియా స్రవంతి.