40 ఏళ్ల సెక్సీ బ్యూటీకి పెళ్లి

Rakhi Sawant announces her wedding with Deepak Kalal
Wednesday, November 28, 2018 - 20:00

తనకు తాను టీనేజ్ గ్లామర్ డాళ్ గా చెప్పుకునే రాఖీసావంత్ పెళ్లికి సిద్ధమైంది. 40 ఏళ్ల లేటు వయసులో ఫ్రెష్ గా పెళ్లికి రెడీ అవుతోంది.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, బూతు కామెంట్స్ తో రచ్చరచ్చ చేసే రాఖీ సావంత్ ను పెళ్లాడబోయేది కూడా దాదాపు అదే టైపు వ్యక్తి. అతడి పేరు దీపక్ కలాల్. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో తిట్టించుకోవడం ఇతడికి బాగా ఇష్టం. లేనిపోని విషయాల్ని కెలికి కంపుచేసి అందరితో చీవాట్లు తినడం ఇతడి ప్రత్యేకత. ఇలాంటి ఇద్దరు వివాదాస్పద వ్యక్తులు కలిశారు. పెళ్లితో ఒకటవ్వబోతున్నారు.

డిసెంబర్ 31 సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం, 5 గంటల 55 నిమిషాలకు లాస్ ఏంజెల్స్ లో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నమని వీళ్లు ప్రకటించారు. తమ పెళ్లికి బాలీవుడ్ బాద్ షా షారూక్, కరణ్ జోహార్ వస్తారని కూడా వీళ్లు తమకుతామే ప్రకటించుకున్నారు. బాలీవుడ్ లో చాలామంది ప్రముఖులకు తాను వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చానని, కానీ అంతా షారూక్, కరణ్ మాత్రమే తాము అమెరికా వస్తామని చెప్పారని అంటోంది రాఖీ.

అంతా బాగానే ఉంది కానీ ఉన్నఫలంగా రాఖీ సావంత్ ఇలా పెళ్లిపై మాట్లాడ్డం అందరికీ విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రియాలిటీ షో పేరిట చాలాసార్లు పెళ్లిచేసుంది రాఖీ. ఆ తర్వాత రియల్ లైఫ్ లో కూడా 2-3 సందర్భాల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత తూచ్ అదేం లేదంటూ తప్పించుకుంది. మరి ఈ పెళ్లి వార్త నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.