మే 12న రానున్న ర‌క్ష‌క‌భ‌టుడు

Rakshaka Bhatudu to release on 12th May
Tuesday, May 2, 2017 - 15:45

రక్ష, జక్కన్న  ఫేం దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించిన సినిమా  "రక్షక భటుడు".  పోలీస్ ని ఆంజనేయ స్వామి అవతారంలో మోస్ట్ పవర్ ఫుల్ గా చూపించి విడుదల చేసిన ఒక్క పోస్టర్ తోనే అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపింది. ఈ సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే ఒక స్టార్ హీరో ఈ మూవీలో న‌టించాడు. కానీ ఆయ‌న పేరుని ఇంత‌వ‌ర‌కు రివీల్ చేయ‌లేదు. సినిమా థియేట‌ర్‌కి వెళ్లిన త‌ర్వాత ఆ సీక్రెట్ తెలుస్తుంద‌ట‌. 

పోలీస్ గెటప్ లో నటించిన ఆ స్టార్ హీరో ఏవరు అని ఇప్ప‌టికే ప‌లువు ఆరా తీయడం మొదలు పెట్టారు అంటే, ఈ సినిమా గురించి సిని మార్కెట్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. రిచా ప‌నై హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌స్తుతం ఆమె ఫోటోల‌నే ప‌బ్లిసిటీకి ఎక్కువ‌గా వాడుతున్నారు.

సుఖీభవ మూవీస్ బ్యానర్ పై ఏ గురు రాజ్ నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. మే 12న విడుదల కానుంది.