బాలీవుడ్‌లో ర‌కుల్ ప్ర‌మోష‌న్స్‌తో బిజీ

Rakul busy promoting Bollywood movie
Monday, May 6, 2019 - 15:45

"మ‌న్మ‌ధుడు 2" సినిమా షూటింగ్ పోర్చుగ‌ల్‌లో జ‌రుగుతోంది. నాగార్జున స‌హా యూనిట్ మొత్తం ఇంకా యూరోప్‌లోనే ఉంది. ఐతే ఈ సినిమా హీరోయిన్ ర‌కుల్‌ మాత్రం త‌న వ‌ర్క్‌ని పూర్తి చేసుకొని ఆల్రెడీ ముంబై వ‌చ్చేసింది. "దే దే ప్యార్ దే" సినిమా ప్ర‌మోష‌న్స్ చేస్తోందిపుడు

అజ‌య్ దేవ‌గ‌న్‌, టబు హీరో, హీరోయిన్లుగా రూపొందిన "దే దే ప్యార్ దే" సినిమాలో అజ‌య్ దేవ‌గ‌న్‌కి యంగ్ ల‌వ‌ర్‌గా న‌టించింది ర‌కుల్ ప్రీతి సింగ్‌. ఈ సినిమా ఈ నెల 17న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా టీవీ షోల‌కి వెళ్ల‌డం, మీడియాకి ఇంట‌ర్వ్యూలివ్వ‌డం చేస్తోంది. అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ త‌న అంద‌చందాలను ఆర‌బోస్తుండ‌డం విశేషం.

ర‌కుల్‌కిపుడు అంత‌గా అవ‌కాశాలు లేవు. మునుప‌టి క్రేజ్ లేదు. అందుకే త‌న ఆశ‌ల‌న్నీ ఇపుడు చేతిలో ఉన్న సినిమాల‌పైనే పెట్టుకొంది. వీటి ప్ర‌మోష‌న్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తోంది.