దానిపై మోజు పోయింది: రకుల్

Rakul goes the vegan way
Monday, February 17, 2020 - 10:30

తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రకుల్ ఇప్పుడు బాలీవుడ్ లో తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే కోట్లు కోట్లు సంపాదించింది రకుల్. ముంబైలో సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయింది. ఈ భామ ఇప్పుడు పూర్తిగా శాకాహారిగా మారింది. "చిన్నప్పటినుంచి మాంసం ఎక్కువగా తీసుకునే దాన్ని. కనీసం ఎగ్స్ ఐన ఉండాలి భోజనంలో. ఆలా పెరిగాను. ఐతే సడెన్ గా నాన్ వెజ్ మీద మోజు పోయింది. పూర్తి వేగన్ గా మారాలని నిర్ణయించుకున్నాను," అని చెప్పింది. 

మరి విదేశాలకి వెళ్ళినప్పుడు పూర్తిగా వెజ్ అంటే కష్టం కదా? "అవును కొన్ని దేశాల్లో వెజ్ ఫుడ్ ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి చోట షూటింగ్ కి వెళ్ళినప్పుడు..... పప్పు, రైస్ ని కిచిడీలా చేయించుకుంటా..అది చాలు," అని పేర్కొంది. 

ఇప్పటికీ బాగా సన్నబడ్డ ఈ భామ ఇప్పుడు హెల్త్ దృష్ట్యా ఇలా వెజ్ కి మారింది. నాన్ వెజ్ మీద మోజు మొత్తం పోయిందన్నమాట.