స్వింగ్ లో భామా సింగ్

Rakul Preet Singh seeking publicity?
Wednesday, January 23, 2019 - 19:00

రకుల్ ఈమధ్య ఒకడ్ని పట్టుకొని చెడామడా వాయించేసింది. డైరక్ట్ గా కాదులెండి. సోషల్ మీడియాలో. తను వేసుకున్న ఓ డ్రెస్ కు సంబంధించి ఓ కుర్రాడు అభ్యంతరకరంగా స్పందిస్తే, రకుల్ అంతెత్తున లేచింది. అతడిపై గయ్ మంది. దెబ్బకు అతడు తన ట్వీట్ డిలీట్ చేసి సైలెంట్ అయిపోయాడు. సరే, ఈ సంగతి అటుంచితే ఎప్పుడూ కూల్ గా, స్వీట్ గా ఉండే రకుల్ ఉన్నఫలంగా ఎందుకింత రెచ్చిపోయిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి రకుల్ పై సదరు వ్యక్తి చేసిన స్లట్ షేమింగ్ అనేది చాలా చిన్నది. ఆమెను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లకు అంతకంటే పెద్ద బూతులే దొరుకుతాయి. అప్పుడు రియాక్ట్ అవ్వని ఈ భామా సింగ్ ఇప్పుడెందుకు ఇంతలా రెచ్చిపోయిందనేది టాపిక్. దీనికి అంతా మూకుమ్మడిగా ఒకటే లాజిక్ చెబుతున్నారు. అదే ఫ్రీ-పబ్లిసిటీ.

అవును.. ఈ భామా సింగ్ కూడా పబ్లిసిటీ కోసమే ఇలాంటివి చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలిచ్చేవాళ్లు తగ్గిపోయారు. మరీ ముఖ్యంగా స్పైడర్ తర్వాత పిల్ల జాతకం రివర్స్ అయింది. కిందామీదా పడి కథానాయకుడు సినిమాలో ఓ రోల్ చేసినప్పటికీ అది కాస్తా డిజాస్టర్ అయింది. దీంతో రకుల్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అందుకే పబ్లిసిటీ కోసం రకుల్ ఇలా సోషల్ మీడియాలో రెచ్చిపోయిందంటున్నారు కొంతమంది. అటు హిందీ, తమిళ్ లో మాత్రం ఈ పిల్ల మంచి స్వింగ్ లో ఉంది.