బాలీవుడ్‌లోనూ బ్యాడ్‌ల‌క్‌!

Rakul scores flop in Bollywood too
Saturday, February 17, 2018 - 20:00

తెలుగులో హిట్‌లు రావ‌డం లేదు, ఆఫ‌ర్లు రావ‌డం లేద‌నీ బాలీవుడ్‌పై ఫోక‌స్ పెడితే అక్క‌డ కూడా క‌లిసి రావ‌డం లేదు ర‌కుల్‌కి. ఆమె ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అయ్యారీ సినిమా శుక్ర‌వారం విడుద‌లయింది. క్రిటిక్స్ సినిమా బాలేద‌ని తేల్చారు. జ‌నం కూడా సినిమా చూసేందుకు అంత‌గా ఆశ‌లు చూప‌లేదు.

సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన‌ అయ్యారీ చిత్రానికి తొలి రోజు 3.36 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇండియా మొత్తం వ‌చ్చిన నెట్ క‌లెక్ష‌న్లు ఇవి. మొద‌టి వీకెండ్‌కి ప‌ది కోట్లు కూడా దాటేలా లేదు.

అంటే ఫ్లాప్ దిశ‌గానే సాగుతోంది ఈ చిత్రం.ద‌ర్శ‌కుడు నీరజ్ పాండేపై నమ్మకంతో ఈ సినిమా చేసింది ఈ అమ్మ‌డు. ఈ ద‌ర్శ‌కుడు ఇంత‌కుముందు ఏ వెడ్న‌స్‌డే, బేబీ వంటి మంచి చిత్రాలు తీశాడు. పెద్ద హిట్స్ అందించాడు. కానీ అయ్యారీకి ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి.