హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రకుల్

Rakul shifts to Hyderabad again!
Wednesday, July 22, 2020 - 12:00

హీరోయిన్ రకుల్ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. లాక్ డౌన్ కారణంగా 3 నెలల పాటు ముంబయిలోనే లాక్ అయిన ఈ ముద్దుగుమ్మ, నిబంధనలు సడలించిన తర్వాత హైదరాబాద్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె నేరుగా ముంబయి నుంచి గుర్గావ్ లోని తన సొంతింటికి వెళ్లిపోయింది. అలా నెల రోజుల పాటు ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేసింది. అందుకే హైదరాబాద్ లో ల్యాండ్ అయింది

నిజానికి ఇప్పటికిప్పుడు రకుల్ చేయాల్సిన సినిమాలేం లేవు. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తోంది. కానీ అది ఇప్పట్లో సెట్స్ పైకి రాదు. పైగా నితిన్ పెళ్లి పనుల్లో బిజీగాా ఉన్నాడు. సో.. ఆమె కేవలం తన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు, మిగతా బిజినెస్ పనుల మీదనే హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ లో రకుల్ కు సొంత ఫ్లాట్ ఉంది. పైగా సిటీలో ఆమెకు కొన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులున్నాయి. వీటితో పాటు హైదరాబాద్, వైజాగ్ లో ఆమెకు జిమ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ వచ్చింది రకుల్.

హిందీలో ఆమెకు ఓ మూవీ కమిట్ మెంట్ ఉంది. ముందుగా అదే స్టార్ట్ అయితే ముంబయికి షిఫ్ట్ అవుతుంది. లేదంటే హైదరాబాద్ లోనే  ఉంటుంది.