రకుల్ రహస్యాలు

Rakul talks about personal issues
Tuesday, May 19, 2020 - 17:15

టాలీవుడ్ లో రకుల్ పరిస్థితేం బాగాలేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇవేవీ తనను ఇబ్బంది పెట్టవంటోంది ఈ పొడుగు కాళ్ల సుందరి. సినిమాలతో సంబంధం లేకుండా తను ఆనందంగా ఉంటానంటోంది. ఆ రహస్యాల్ని కూడా షేర్ చేసింది.

- మనం ఎంత సంతోషంగా ఉన్నామనేదే మన విజయం. విజయానికి గుర్తు మనం సంపాదించిన షీల్డులు, డబ్బులు కాదు. మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత విజయం సాధించినట్టు. ఈ విషయంలో నేను విజేతనే.

- అతిగా ఆనందించడం లేదా అతిగా బాధపడడం నాకు ఇష్టం ఉండదు. ఆనందమైనా, బాధనైనా ఒకేలా తీసుకుంటాను. నాలో ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా ఎక్కువ. అందుకే బ్యాలెన్స్ డ్ గా ఉంటాను.

- మనం ఆనందంగా ఉండాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. ఉదయమే లేచి వర్కవుట్స్, యోగా చేస్తాను. చెప్పిన టైమ్ కు షూటింగ్ కు వెళ్తాను. క్రమశిక్షణ కోసం నన్ను నేను కష్టపెట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడను.

ఇవన్నీ పాటిస్తే ఆనందంగా ఉంటామంటోంది రకుల్. జీవితం అంటే కేవలం విజయాలు మాత్రమే కాదని, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉందంటూ వేదాంతం చెబుతోంది.