ఆ మూడు ఉండాలి: ర‌కుల్‌

Rakuul loos three qualities in her man
Thursday, May 23, 2019 (All day)

హీరోయిన్ ర‌కుల్ ప్రీతి సింగ్ న‌టించిన హిందీ చిత్రం..దే దే ప్యార్ దే స‌క్సెస్‌పుల్‌గా ర‌న్ అవుతోంది. హిట్ అనిపించుకునేలా ఉంది. మొద‌టి వారం క‌లెక్ష‌న్లు బాగానే ఉన్నాయి. ఈ ఆనందంలో ఈ భామ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి, త‌న అభిరుచుల గురించి, తాను కోరుకునే విష‌యాల గురించి ట‌కా ట‌కా చెప్పేస్తోంది.

ఆమె ల‌వ్‌లైఫ్ గురించి బ‌య‌ట చాలా రూమ‌ర్స్ ఉన్నాయి. కానీ ఆన్ రికార్డు మాత్రం తాను ఎవ‌ర్నీ ప్రేమించ‌డం లేద‌ని, త‌న‌కి ఎవ‌రితోనూ ల‌వ్ రిలేష‌న్ లేదంటోంది. ఐతే కాబోయే వాడిపై మాత్రం కలలున్నాయ‌ట‌. ఆమెని పెళ్లి చేసుకునేవాడికి మూడు ల‌క్ష‌ణాలుండాల‌ట‌.

1. కనీసం ఆరడుగులు ఉండాలి

2. అత‌నికి ప్యాషన్‌, ఓ లక్ష్యం ఉండాలి

3. సెన్సాఫ్ హ్యుమ‌ర్ త‌ప్ప‌నిస‌రి

ఈ ల‌క్ష‌ణాలున్న వాడిని  మాత్ర‌మే పెళ్లి చేసుకుంటానంటోంది. ఇవి పెద్ద విష‌యాలే కావు. ఆర‌డుగులుండి మిగ‌తా రెండు క్వాలిటీస్ ల‌క్షల్లో ఉంటారు.  ఆ మూడు ఉన్న వాడు ఆమె ఎదుట క‌నిపిస్తే వెంట‌నే ఆమెకి మూడొచ్చి మూడు ముళ్లు వేయించుకుంటుందేమో!