నూర్ ఫామిలీకి చరణ్ విరాళం

Ram Charan announces Rs 10 lakh to Noor family.
Monday, December 9, 2019 - 14:45

మెగాస్టార్ అభిమానుల్లో చాలా సీనియర్ అయిన నూర్ అహ్మద్ ఇటీవల కన్నుమూశారు. చిరంజీవి, అల్లు అర్జున్ నూర్ ఇంటికి వెళ్లి  నివాళులు ఆరోపించారు. రామ్ చరణ్ తాజాగా నూర్ కుటుంబానికి 10 లక్షల విరాళం ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మెగా అభిమానుల అధ్యక్షుడిగా నూర్ తమ కుటుంబ హీరోలకి చేసిన సేవలను చరణ్ గుర్తు తెచ్చుకున్నారు. సిటీలో లేకపోవడంతో నిన్న అయన భౌతికకాయానికి నివాళులు అర్పించలేకపోయాడట. 

హైదరాబాద్ కి రాగానే వారి కుటుంబసభ్యులని కలిసి పరామర్శిస్తాను అన్నారు. 10 లక్షల ఆర్థిక సాయంతో వారి ఫామిలీ కి అండగా ఉంటాను అని చెప్పారు.