సొంతంలో అన్ని కాదు: చరణ్

Ram Charan gives clarity about Konidela Productions
Thursday, January 9, 2020 - 15:15

దాదాపు స్టార్ హీరోలందరికీ బ్యానర్లున్నాయి. కొంతమంది తమ బ్యానర్ పై నేరుగా సినిమాలు నిర్మిస్తే, మహేష్ లాంటి హీరోలు కో-ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ బ్యానర్ అయితే ప్రస్తుతం ఇన్-యాక్టివ్ మోడ్ లో ఉంది. రామ్ చరణ్ కూడా బ్యానర్ పెట్టాడు. అయితే తను ఎందుకు బ్యానర్ పెట్టాడు, తన ఉద్దేశం ఏంటనే విషయాన్ని తాజాగా బయటపెట్టాడు ఈ హీరో.

"నా బ్యానర్ గురించి నేనేం ఆలోచించలేదు. నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి స్థాపించిన బ్యానర్ అది. 2 సినిమాలు చేశాం. బ్యానర్ ను ఇలానే కంటిన్యూ చేయాలని నాక్కూడా లేదు. నా కెరీర్ పై నేను కూడా ఫోకస్ పెట్టాలి కదా. మళ్లీ ఏదైనా ఎగ్జైటింగ్ స్టోరీ దొరికితే ప్రొడక్షన్ గురించి ఆలోచిస్తానేమో. అంతే తప్ప, రెగ్యులర్ ప్రొడక్షన్ హౌజ్ లాగ వరుసగా సినిమాలు మాత్రం తీయను."

కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇకపై చాలా సెలక్టివ్ గా సినిమాలు వస్తాయని చెప్పకనే చెప్పేశాడు రామ్ చరణ్. నిజానికి ఈ బ్యానర్ పై మెగాహీరోలంతా సినిమాలు చేస్తారని అప్పట్లో ఓ పుకారు వచ్చింది. చిరంజీవితో సినిమా కంప్లీట్ అయిన వెంటనే పవన్ కల్యాణ్ తో ఒకటి, ఆ తర్వాత బన్నీతో ఇంకోటి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగాహీరోలంతా ఈ సంస్థలో నటిస్తారంటూ కథనాలు వచ్చాయి. ఒక దశలో ఈ బ్యానర్ పై మెగా మల్టీస్టారర్ మూవీ కూడా వస్తుందంటూ ఊహాగానాలు చెలరేగాయి.

వాటన్నింటికీ ఇలా ఒకేసారి చెక్ పెట్టాడు రామ్ చరణ్. తనను ఎంతో కదిలిస్తే తప్ప సొంత బ్యానర్ లో సినిమా చేయనని కరాఖండిగా చెప్పేశాడు.