చ‌ర‌ణ్‌కి భారీ ఫ్యామిలీ సెట‌ప్‌

Ram Charan to have huge family setup in Boyapati's movie
Tuesday, January 23, 2018 - 16:00

రామ్‌చ‌ర‌ణ్ - బోయ‌పాటి సినిమా ఆల్రెడీ మొద‌లయింది. ఈ సినిమా షూటింగ్‌లో చ‌ర‌ణ్ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు నుంచి పాల్గొంటాడు. ఇందులో చ‌ర‌ణ్‌కి హీరోయిన్ ఒక‌రే. ఆమె పేరు కైరా అద్వానీ. కానీ చ‌ర‌ణ్‌కి న‌లుగురు వ‌దిన‌లుంటార‌ట ఈ సినిమాలో.

బోయ‌పాటి తీసేది మాస్ మ‌సాలా సినిమాలే ఐనా.. హీరోకి, హీరోయిన్‌కి పెద్ద కుటుంబ బ‌లం ఉన్న‌ట్లు చూపుతాడాయ‌న‌. దీనికి ఒక వింతైన రీజ‌న్ కూడా చెపుతాడు బోయ‌పాటి. ఆయ‌న‌కి కుటుంబ బంధాలు ఎక్కువంట‌."మా ఇంటికి వ‌స్తే తెలుస్తుంది. ఇంటి నిండా అక్క‌లు, చెల్లెళ్లు, బావ‌లు, అన్న‌య్య‌లు, వారి పిల్ల‌లు...ఇలా అంత ఎపుడూ సంద‌డి సంద‌డిగా ఉంటుంది. నా సినిమాల్లో కూడా హీరో అలా ఉండాల‌నుకుంటా", అని బోయ‌పాటి రీజ‌న్ ఇస్తాడు.

ద‌ర్శ‌కుడి నిజ‌జీవితంలో ఉన్న‌వ‌న్నీ...సినిమాలో హీరోకీ ఉండాల‌నుకోవ‌డం అనేది లాజిక్‌కి అంద‌దు. స‌రే..అది బోయ‌పాటి మార్క్‌. లాజిక్‌లు అడగొద్దు. పైగా హిట్స్‌తో సాగుతోంది బోయ‌పాటి కెరియ‌ర్‌. స‌క్సెస్‌లో ఉన్న‌వారికి ఈ సినిమా ఇండ‌స్ట్రీలో క్వ‌శ్చ‌న్స్ ఉండ‌వు, ఎస్ బాస్ అన‌డ‌మే ఉంటుంది.

అందుకే ఇపుడు చ‌ర‌ణ్‌తో తీస్తున్న సినిమాలో భారీ ఫ్యామిలీని సెట్ చేశాడు బోయ‌పాటి. హీరోకి న‌లుగురు అన్న‌లు, వ‌దిన‌లు. ఒక అన్న‌గా త‌మిళ హీరో ప్ర‌శాంత్ న‌టిస్తున్నాడు. ఇతర అన్న‌లుగా ఎవ‌రు న‌టిస్తున్నారో తెలియ‌దు కానీ న‌లుగురు వ‌దిన‌లుగా స్నేహ‌, అన‌న్య‌, హిమ‌జ‌, ప్ర‌వీణ న‌టిస్తున్నార‌ట‌. ఏదీ ఏమైనా సినిమాకి హిట్ క‌ళ క‌నిపిస్తుంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల భోగ‌ట్టా. సో బోయ‌పాటి ఖాతాలో, చ‌ర‌ణ్ ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌డ‌బోతుంద‌న్న‌మాట‌.