చేయాలా వద్దా.... చరణ్ డైలమా

Ram Charan posts his workout from home pics
Friday, July 10, 2020 - 12:15

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోలంతా ఇళ్లకే ఫిక్స్ అయిపోయారు. దీంతో వాళ్ల లేటెస్ట్ పిక్స్, మేకోవర్స్ కనుక్కోవడం ఫ్యాన్స్ కు కష్టంగా మారింది. మహేష్ లాంటి హీరోలు ఎప్పటికప్పుడు ఫొటోలు రిలీజ్ చేస్తున్నారు కానీ చరణ్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

దాదాపు 3 నెలలుగా ఇంటికే పరిమితమైపోయిన చరణ్, తన లేటెస్ట్ లుక్ తో ఈరోజు కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశాడు. అవి చరణ్ వర్కవుట్ కు సంబంధించిన స్టిల్స్. ఎక్సర్ సైజ్ చేయాలని బుర్ర చెబుతోంది.. కానీ మనసు మాత్రం వద్దంటోంది అనే క్యాప్షన్ తో చరణ్ ఈ స్టిల్స్ ను పోస్ట్ చేశాడు.

అంతా బాగానే ఉంది కానీ ఈరోజు చరణ్, వర్కవుట్ చేశాడా లేదా అనేది మాత్రం సస్పెన్స్. ఈ సంగతి పక్కనపెడితే.. చరణ్ లుక్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. ఆర్ఆర్ఆర్ లో సీతారామరాజు గెటప్ కోసం పెంచిన గడ్డాన్ని చెర్రీ కాస్త ట్రిమ్ చేసినట్టు కనిపిస్తోంది.