మీరు క్యూ లో ఉన్నారు: రామ్ చరణ్

Ram Charan puts directors in waiting
Saturday, February 8, 2020 - 17:30

రామ్ చరణ్ కథలు వింటున్నాడు. ప్రస్తుతం "ఆర్.ఆర్.ఆర్" సినిమాలో నటిస్తున్నాడు. ఇది జూన్ వరకు పూర్తి అవుతుంది. ఆ తర్వాత కొరటాల శివ సినిమాలో నటిస్తాడు. అందులో పెద్ద పాత్ర. హీరో కాదు కానీ తండ్రి హీరోగా నటిస్తున్న మూవీలో పెద్ద రోల్ చేస్తున్నాడు చరణ్. ఆగస్టు నుంచి చరణ్ ఖాళీగా ఉంటాడు. అందుకే ఇప్పటి నుంచే కథలు వింటున్నాడు. ఐతే ఎవరికీ ఒకే చెప్పడం లేదు.. యు అర్ ఇన్ క్యూ అని అందరిని హోల్డ్ లో పెడ్తున్నాడు. 

జెర్సీతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం అదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ పని ప్రారంభించడానికంటే ముందే రామ్ చరణ్ కు ఓ స్టోరీలైన్ వినిపించాడు గౌతమ్. మూవీ మాత్రం ఇంకా లాక్ అవ్వలేదు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిఫరెన్స్ తో చరణ్ ను కలిసిన గౌతమ్ తిన్ననూరి.. ఏకంగా 3 స్టోరీలైన్స్ వినిపించాడు. అయితే రామ్ చరణ్ మాత్రం వీటిలో ఏ ఒక్క స్టోరీలైన్ కు ఓకే చెప్పలేదు. మూడూ బాగున్నాయని మాత్రమే అన్నాడు. జెర్సీ హిందీ రీమేక్ పూర్తయిన తర్వాత మరోసారి కలుద్దామని మాత్రమే చెప్పాడు. 

అలాగే ఒక పెద్ద దర్శకుడు కూడా ఇలాగే చరణ్ కి కథ చెప్పాడు... మళ్ళీ కలుద్దాం అని ఆ దర్శకుడికి చెప్పాడు చరణ్. అయితే, ఆ దర్శకుడు ఈ గ్యాప్ లో మరో పెద్ద హీరోతో కథ ఓకె చేయించుకొని... దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు.