చరణ్ బాలీవుడ్ రీఎంట్రీ అప్పుడే!

Ram Charan talks about Bollywood re-entry
Tuesday, August 20, 2019 - 23:00

"జంజీర్" తర్వాత మళ్లీ బాలీవుడ్ లో కనిపించలేదు చరణ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో చరణ్ కు బాలీవుడ్ పై విరక్తి పుట్టింది. ఇక దాదాపు హిందీ సినిమాలకు ఆయన గుడ్ బై చెప్పేసినట్టే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ తన బాలీవుడ్ రీఎంట్రీ గురించి చరణ్ రియాక్ట్ అయ్యాడు. 

ఈరోజు ముంబయిలో సైరా టీజర్ లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన చరణ్ కు తన రీఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. దీనికి చరణ్ సూటిగా సమాధానం ఇచ్చాడు. తను బాలీవుడ్ నుంచి తప్పుకోలేదని, మంచి కంటెంట్ దొరక్కపోవడం వల్లనే హిందీలో సినిమా చేయలేకపోయానని స్పష్టంచేశాడు. వచ్చే ఏడాది ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నానని స్పష్టంచేశాడు. 

బాహుబలి తర్వాత బాలీవుడ్ లో రాజమౌళికి బాగా డిమాండ్ పెరిగింది. అలాంటి దర్శకుడితో చేస్తున్న సినిమా కావడంతో ఆర్-ఆర్-ఆర్ కు హిందీలో కూడా మంచి బజ్ వచ్చింది. అందుకే ఆర్-ఆర్-ఆర్ ను హిందీలో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా చరణ్ కు రీఎంట్రీ అయితే, తారక్ కు హిందీ డెబ్యూగా పనికొస్తుందన్నమాట.