దీపాలు వెలిగించండి: రామ్ చరణ్

Ram Charan urges people to light lamps
Saturday, April 4, 2020 - 15:30

ప్రధాని మోది చెప్పినట్లు అందరూ దీపాలు వెలిగించాలి అంటున్నాడు రామ్ చరణ్. మొన్న జనతా కర్ఫ్యూ సందర్భంగా చిన్న పెద్దా, సామాన్యుడు సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి మనం కోసం కష్టపడుతున్న డాక్టర్లకు, పోలీసులకు, నర్సులకు, ప్రభుత్వ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాము. ఇప్పుడు ఏప్రిల్ 5న దీపాలు వెలిగించండి అని ప్రధాని పిలుపు ఇచ్చారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఒకవైపు కేసులు పెరుగుతుంటే.. ప్రధాని గిమ్మిక్కుల మీద ఫోకస్ పెట్టారనేది ప్రధాన విమర్శ.

కాస్త బుర్ర వున్నవాళ్లు అంతా ఈసారి ప్రధాని పిలుపు అర్ధరహితం అని గ్రహించారు. కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం ప్రధాని "గుడ్ బుక్స్" ఉండేందుకు పోటీ పడుతున్నారు. అందరూ దీపాలు వెలిగించండి అంటూ ట్వీట్స్ పెడుతున్నారు.

చరణ్ కూడా తాజాగా ఒక వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు