భార్యకు ప్రేమతో...!

Ram Charan's birthday wish to Upasana
Monday, July 20, 2020 - 16:45

రామ్ చరణ్ భార్యగానే కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఉపాసనకు తనదైన స్టయిల్ లో శుభాకాంక్షలు అందించాడు చెర్రీ. ఆమెకు సంబంధించిన బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన చరణ్.. తను చేస్తున్న మంచి పనులు ఎప్పటికీ వృధాకావంటూ పోస్ట్ పెట్టాడు.

"ఇతరుల పట్ల నువ్వు చూపించే దయ, చేసే చిన్న చిన్న మంచి పనులు ఎప్పటికీ వృధా కావు. నువ్వు ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను. రివార్డ్స్ వాటంతట అవే వస్తాయి. హ్యాపీ బర్త్ డే."

ఇలా సింపుల్ అండ్ స్వీట్ గా భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించాడు చరణ్.

రామ్ చరణ్, ఉపాసన మధ్య బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. చరణ్ కు అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటారు ఉపాసన. సేమ్ టైమ్.. ఛారిటీ కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. ఎప్పటికిప్పుడు పనికొచ్చే వీడియోలు షేర్ చేస్తుంటారు. తన అపోలో సిబ్బందితో కలిసి ఈ కరోనా కాలంలో ఉపాసన చేసిన వీడియోలు చాలామందికి ఉపయోగపడ్డాయి.